News October 10, 2024

సీఎం హామీలను నెరవేర్చాలి: కలెక్టర్

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం హామీల సాధనపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్‌కు సంబంధించి 203 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 మందికి ఇళ్ల స్థలాల మంజూరుకు భూమిని గుర్తించాలని డీఆర్ఓను అదేశించారు.

Similar News

News November 14, 2024

వెలుగోడులో యువతి ఆత్మహత్య

image

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ఎస్సీ కాలానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై విష్ణు నారాయణ వివరాల మేరకు.. తల్లిదండ్రులు బయటకి వెళ్లిన సమయంలో 19 ఏళ్ల యువతి ఇంట్లో ఉరేసుకుంది. బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కూతురి బలవన్మరణాన్ని గమనించి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News November 14, 2024

KNL: బాలికపై అత్యాచారయత్నం.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్!

image

కర్నూలు జిల్లా కోసగి మండలంలో 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వైసీపీ నేత, సర్పంచ్ హుసేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కార్యకర్తలు వినోద్, సూరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అత్యాచారయత్నం అనంతరం పరారీలో ఉన్న నిందితులను కోసిగి గ్రామ శివారులో అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 14, 2024

ఓంకారం: ఆకలి తీర్చేందుకు వెళ్లి అనంత లోకాలకు

image

ఓంకారం వద్ద ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు భక్తుల ఆకలి తీర్చేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏ కోడూరుకు చెందిన మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి, బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అన్నదానం నిమిత్తం బియ్యం, సామాగ్రిని ఆలయం వద్ద దించి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఇద్దరు మృతి చెందగా, చిన్నన్న, శేషన్న గాయపడ్డారని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.