News October 12, 2024

సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ స్వగ్రామానికి రాక!

image

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారిగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి నేడు వస్తున్నారు. దసరా పండగకు కుటుంబంతో స్వగ్రామానికి వచ్చే ఆనవాయితీ పాటించే రేవంత్​రెడ్డి ఈ సారి సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రానున్నారు. CM రాక సందర్భంగా MLA వంశీకృష్ణ, కలెక్టర్​ బదావత్​ సంతోష్​, కొండారెడ్డిపల్లి నోడల్​ ఆఫీసర్​ డాక్టర్​ రమేశ్ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Similar News

News November 3, 2024

NRPT: శ్రీశైలం వెళ్ళే భక్తులకు శుభవార్త

image

నారాయణపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రేపటి నుంచి బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కార్తీకమాసం పురస్కరించుకొని బస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. బస్టాండ్ నుంచి ప్రతి రోజూ ఉదయం 8:30 గంటలకు డీలక్స్ బస్ శ్రీశైలం బయలుదేరి వెళ్లి మళ్ళీ మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి నారాయణపేటకు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News November 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఓపెన్ DEGREE, PG.. దరఖాస్తుకు గడువు పడగింపు
✔రేపటి నుంచి పెళ్లిళ్ల సీజన్ షురూ..DEC వరకు ముహూర్తాలే
✔SDNG:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
✔మెస్ చార్జీలు పెంచడంతో విద్యార్థుల హర్షం
✔Way2Newsతో దివాలి భక్తులు
✔PUలో 6,7,8న సౌత్ జోన్ ఎంపికలు
✔ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధం
✔నేటి నుంచి ప్రారంభమైన యాక్ట్-30
✔కురుమూర్తి స్వామికి సిద్ధమవుతున్న పట్టు వస్త్రాలు
✔BC సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ 

News November 3, 2024

ఆత్మకూరు: కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు వివిధ ప్రాజెక్టుల్లో శనివారం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు సూపర్డెంట్ ఇంజినీర్ సూరిబాబు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు మూడు యూనిట్లలో 33.459 యూనిట్ల ఉత్పత్తి, లోయర్ జూరాల ప్రాజెక్టులో మూడు యూనిట్లలో 319.165 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు ఆయన తెలిపారు.