News March 10, 2025
సీఐడీ చేతికి ఫాల్కన్ ఇన్వెస్టింగ్ కేసు!

తెలంగాణ సీఐడీ చేతికి ఫాల్కన్ కేసు వెళ్లనుంది. ఇప్పటివరకు 19 మంది నిందితుల్లో ముగ్గురు అరెస్ట్ కాగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఫాల్కన్ కేసును సీఐడీ బదిలీకి సైబరాబాద్ పోలీసుల నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో వేల సంఖ్యలో బాధితులున్నారు. సైబరాబాద్ పోలీసులు సీఐడీకి అప్పజెప్పే అవకాశం కనబడుతోంది.
Similar News
News March 11, 2025
HYD: సైబర్ క్రైం.. రూ.36 లక్షలు ఇప్పించారు

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగిపై డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు జరిపారు. ఫెడక్స్ కొరియర్ డ్రగ్స్ పేరుతో 43లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బును ఫ్రీజ్ చేసి 36లక్షల రూపాయలను బాధితుడికి డీడీ ద్వారా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అందజేశారు.
News March 11, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

హైడ్రా సోమవారం ప్రజావాణిని నిర్వహించింది. ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత లేఔట్లు, రహదారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాలని పలువురు వినతులు అందజేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన లేదని పలువురు వాపోయారు.
News March 10, 2025
HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.