News August 17, 2024
సీఐని అభినందించిన కడప జిల్లా ఎస్పీ

పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సీఐ ఎ.సాదిక్ అలీని కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడల్ గ్రహీత సాదిక్ అలీ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే స్పూర్తితో మున్ముందు విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
Similar News
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
News December 7, 2025
ప్రొద్దుటూరు: రూ.10 లక్షల పెనాల్టీ.!

ప్రొద్దుటూరులో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారంపై జీఎస్టీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ట్రావెల్, కొరియర్ కార్యాలయాలు వందకుపైగా ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో బంగారం, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మందులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వీటిపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం దాడులు చేసి ఒక్క రోజులోనే రూ.10 లక్షలు పైగా పెనాల్టీ వసూలు చేశారు.
News December 7, 2025
వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.


