News February 1, 2025

సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్: జగ్గారెడ్డి

image

సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మారాడని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి హైదరాబాదులోని గాంధీభవన్లో ఖండించారు. రియల్ ఎస్టేట్ కొంపముంచింది కేసీఆరేనని విమర్శించారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్‌ను కేసీఆర్ నాశనం చేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 17, 2025

కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్‌రావు

image

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ హరీశ్ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

News February 17, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి

image

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు..కోహిర్ మండలం షెట్టేగుంట తండాలో విందుకు వెళ్లిన పవన్(26), శంకర్(25).. అనంతరం బైక్ పై సిద్దాపూర్ తండాలోని బంధువుల ఇంటికి వెళ్తన్నారు. ఈ క్రమంలో గొడిగార్‌పల్లి శివారులో మూలమలుపు వద్ద బస్సు, బైక్ ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా శంకర్ చనిపోయారు.

News February 17, 2025

సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

image

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్‌పూర్‌కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్‌తో కలిసి ఫైనాన్స్‌లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్‌తో కలిసి హత్య చేశారు.

error: Content is protected !!