News August 31, 2024
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి: మంత్రి

ప్రజలు, అధికారులు ప్రస్తుత వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ధర్మవరంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున వైద్య సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు శానిటేషన్ కార్యక్రమాలు చేస్తుండాలని, ఆస్పత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.
Similar News
News February 10, 2025
సమస్యలు ఉంటే కలవండి: అనంత కలెక్టర్

అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరుకావాలన్నారు.
News February 9, 2025
బ్రహ్మసముద్రం: పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మగానిపల్లి తండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 9, 2025
అదుపుతప్పి కారు బోల్తా.. మహిళ మృతి

కర్నూలు(D) వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపాన శనివారం కారు బోల్తాపడి మహిళ మృతిచెందింది. సత్యసాయి(D) బత్తలపల్లి(M) గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) HYDలో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్, మరిది అమర్‌నాథ్‌తో కలిసి కారులో బయలుదేరారు. మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. తన ఒడిలో ఉన్న వియాన్స్‌ను అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి, తాను మృతిచెందింది.