News June 21, 2024
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలు గురించి ఆయనకు కలెక్టర్ వివరించారు.
Similar News
News September 15, 2024
దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి
దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.
News September 15, 2024
ఉప్పాడ సముద్రంలో అద్భుత దృశ్యం (PHOTO)
పిఠాపురం మండల పరిధిలోని ఉప్పాడ సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతంలో శనివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎరుపు రంగులో ఉన్న వరద నీరు భారీగా సముద్రంలో కలుస్తున్న వేళ ఒకవైపు నీలివర్ణం, మరోవైపు ఎరుపు వర్ణంతో కూడిన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నా చెల్లెళ్ల గట్టుగా పిలిచే ఈ ప్రాంతంలో వరద నీరు వస్తున్నన్నీ రోజులు ఇదే విధంగా ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
News September 15, 2024
రాజమండ్రి: చిరుత కోసం 50 మంది
దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు దానిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందుకు మొత్తం 50 మంది సిబ్బంది 9 బృందాలుగా ఏర్పడ్డారని DFO భరణి తెలిపారు. ఇళ్ల ముందు చెత్త వేయొద్దని కోరారు. చెత్తను తినేందుకు కుక్కలు, పందులు వస్తాయని వాటి కోసం చిరుత వచ్చే అవకాశం ఉందన్నారు. 16వ నంబర్ జాతీయరహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.