News August 28, 2024
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి: కమిషనర్
ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య(స్పెషల్ డ్రైవ్) పనులకు శ్రీకారం చుట్టామని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ఆమె పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న స్పెషల్ డ్రైవ్ పనులను తనిఖీ చేసి పరిశీలించారు. చెత్తాచెదారం నగరంలో కనిపించకుండా చేయాలని సిబ్బందికి పలు సలహాలు, సూచనలతో ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 14, 2024
రామగుండంలో వందేభారత్ హాల్ట్
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
News September 14, 2024
KNR: నిమజ్జనం రోజున వైన్స్ విక్రయాలు బంద్
ఈనెల 16న గణేష్ నిమజ్జనం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా సోమవారం మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో మద్యం దుకాణాలు, బార్లు క్లోజ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా షాపులు తెరుచుకుంటాయి.
News September 13, 2024
కరీంనగర్: పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు అన్నివిధాలుగా సహకరించాలని కోరారు.