News March 4, 2025
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO డాక్టర్ విజయమ్మ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం అద్దంకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను DMHO సందర్శించారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు ఇచ్చారు.
Similar News
News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 13, 2025
ఊట్కూర్: రూ.3.91కోట్ల అవకతవకలు.. ఐదుగురి అరెస్ట్

ఉట్కూర్లోని SBI బ్యాంక్లో 2016–2019 మధ్య నకిలీ పట్టా పాస్బుక్స్ ఆధారంగా 414 ఖాతాల్లో సుమారు రూ.3.91 కోట్లు మోసం చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్యాంక్ మేనేజర్ SR నాగరాజు, క్యాషియర్ మంత నరేష్, మధ్యవర్తులు పూడూరు సత్యనారాయణ, మలీ పటేల్ సోమిరెడ్డి, కుర్మిరెడ్డిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మరికొంతమంది ప్రమేయంపై విచారణ జరుగుతోందని CI తెలిపారు.
News November 13, 2025
TG TET షెడ్యూల్ విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.


