News March 4, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO డాక్టర్ విజయమ్మ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం అద్దంకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను DMHO సందర్శించారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు ఇచ్చారు. 

Similar News

News July 9, 2025

యువీ ‘లక్ష్యం’ కోసం కదలిన తారలు

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఛారిటీ ‘YouWeCan’ కోసం క్రికెట్ సెలబ్రిటీలు తరలివచ్చారు. లండన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా క్యాన్సర్ రోగుల కోసం యువీ సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసిందే.

News July 9, 2025

APలో భారీ పెట్టుబడి: TDP

image

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.

News July 9, 2025

రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను రేపు కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణ్ దేవ్ ప్రకటించారు. ఆండర్-13, 14 విభాగాల్లో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. 2011-12 సంవత్సరాల మధ్య జన్మించిన క్రీడాకారులు పోటీలకు అర్హులని తెలిపారు.