News April 3, 2025
సీడ్స్ సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్

దుత్తలూరులోని సీడ్స్ ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, కంటి పరీక్షలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ సంస్థ సేవలందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 25, 2025
NLR: నేటి నుంచి నోషనల్ ఖాతాల స్పెషల్ డ్రైవ్

నెల్లూరు జిల్లాలో 95వేలకు పైగా ఉన్న నోషనల్ ఖాతాల పరిష్కారానికి ఈనెల 25 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. 1,84,288 సర్వే నంబర్లలోని 95,065 నోషనల్ ఖాతాలకు సంబంధించి రోజూ జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి రెండేసి మండలాల చొప్పున పరిశీలిస్తారు. రోజూ 8 మండలాల నోషనల్ ఖాతాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారు.
News April 24, 2025
NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

రేషన్ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్ ఇంటర్నెట్లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.
News April 24, 2025
16 పాఠశాలల్లో అందరూ పాస్: అరుణమ్మ

నెల్లూరులోని 16 జడ్పీ పాఠశాలల్లో అందరూ పాసయ్యారని జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 10,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 7,414 మంది పాసయ్యారని చెప్పారు. 595 మార్కులతో పూజిత అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు.