News September 24, 2024
సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా సుబ్బారెడ్డి

డోన్ నియోజకరవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి వరించింది. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఎన్నికల ముంగిట సీనియర్ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కీలక బాధ్యతలు నిర్వర్తించి కార్యకర్తలకు అండగా ఉండటంతో ఆయనకు టీడీపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
Similar News
News November 23, 2025
కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీలను కూటమిగా ఏకం చేశారని అన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.
News November 23, 2025
5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరణ: కలెక్టర్

మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో డిసెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న 5వ బాలోత్సవం-2025 సన్నాహకాలు వేగంగా జరుగుతున్నాయి. బాలోత్సవానికి ప్రతీకగా రూపొందించిన అధికారిక లోగోను కలెక్టర్ డా.సిరి ఆవిష్కరించారు. బాలోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలను వెలికితీయడానికి ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే పోటీలు, విభాగాలు, తేదీలు, నిబంధనలు, నమోదు చేయాలన్నారు.
News November 23, 2025
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలుకు పతకాలు

ఈ నెల 15, 16వ తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలు క్రీడాకారులు 2 బంగారు, ఒక రజితం, 10 కాంస్య పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం కర్నూలు శరీన్ నగర్లోని వెంకటేష్ తైక్వాండో అకాడమీలో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసులు అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు.


