News November 28, 2024

సీతంపేట: అడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేయాలి

image

సీతంపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్‌కు పర్యాటుకులు భారీ ఎత్తున సందర్శిస్తున్నారు. శీతకాలంలోని మంచు అందాలతో ఆకట్టుకుంటున్న వ్యూపాయింట్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకులు ప్రధాన రహదారిని డెవలప్ చేసి పర్యాటకంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలోనే మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ద్రుష్టి పెట్టాలని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 4, 2025

మెలియాపుట్టి: టీచర్ సస్పెండ్

image

మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా ఉపాధ్యాయురాలిను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు.

News November 4, 2025

సంతబొమ్మాళి: ‘చిన్నారులకు ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదు’

image

చిన్నారులకు క్రమం తప్పకుండా ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదని DyDMHO డాక్టర్ మేరీ కేథరిన్ అన్నారు. సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించి పీహెచ్సీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 4, 2025

ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: మంత్రి అచ్చెన్న

image

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళిలోని నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలగాలన్నారు.