News March 7, 2025
సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.
Similar News
News March 10, 2025
వర్గల్: పెళ్లిలో డిజిటల్ కట్నాల చదివింపులు

పెళ్లిలో ఇంతకాలం పెళ్లికూతురు, పెళ్ళికొడుకు కట్నాల చదివింపులు రాతపూర్వకంగా ఉండేవి. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం కొత్త ట్రెండు మొదలైంది. అంతా డిజిటలైజేషన్ కావడంతో వర్గల్ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు తరపున చదివింపుల కార్యక్రమంలో ఫోన్పే స్కానర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా చదివింపులు చేపట్టారు.
News March 10, 2025
అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా: అద్దంకి

TG: పార్టీ తనను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అందుకే తన పేరును ప్రకటించారని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేయని సంగతి తెలిసిందే.
News March 10, 2025
స్టార్ హీరో సినిమాలో నిధి అగర్వాల్?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్కు మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ హీరో సూర్య సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో ఆమెను తీసుకుంటారని సమాచారం. నిధితో పాటు మరో అప్కమింగ్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్తో ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.