News March 7, 2025
సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.
Similar News
News March 8, 2026
VZM: ‘ఇంటిపై పెట్రోల్, నాటు బాంబులతో దాడి’

డెంకాడ మండలం మోదవలస పంచాయతీలో ఆవాల అప్పన్న ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోదవలసకి చెందిన కొందరు శుక్రవారం పెట్రోల్, నాటు బాంబులతో ఇంటిని తగలబెట్టారని అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిలో వస్తువులతో పాటు సుమారు రూ.2 లక్షల నగదు కాలిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 9మందిని అరెస్ట్ చేసినట్టు SI సన్యాసినాయుడు పేర్కొన్నారు.
News March 8, 2026
చిత్తూరు: పెరుగుతున్న చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, మాంసం రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 8, 2026
నల్గొండ: గ్యాస్ సెగ.. సామాన్యుడిపై రూ.70 కోట్ల అదనపు భారం

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి వంటింట్లో మంటలు రేపింది. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 చొప్పున పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజా పెంపుతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి సుమారు రూ.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ధరల పెరుగుదలపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


