News August 4, 2024
సీతంపేట: గిరిజన విద్యార్థులు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ
ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.
Similar News
News September 11, 2024
SKLM: రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర
కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ జాతర నిర్వహణ కోసం రూ.కోటి మంజూరు చేసింది. ఈ నిధులను అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొంది.
News September 10, 2024
రణస్థలం: వరద బాధితులకు రూ.80లక్షల చెక్కు అందజేత
విజయవాడ వరద బాధితుల కోసం మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏపీ విలేజ్ సర్వేయర్లు అసోసియేషన్ తరుపున రూ.80లక్షల చెక్కును అందజేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన మధు యూనియన్ నాయకులు అయ్యప్పలనాయుడు, కిరణ్‌తో కలిసి విజయవాడలో పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందించారు. రాష్ట్రంలోని సర్వేయర్లు అందరూ ఒకరోజు వేతనాన్ని అందించినట్లు తెలిపారు.
News September 10, 2024
టెక్కలి: కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపునిస్తూ మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాళి ఉత్సవాల నిర్వహణకు రూ.1 కోటి రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్‌లో నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపుపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.