News March 28, 2025
సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.
Similar News
News November 19, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 19, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News November 19, 2025
సిర్పూర్(టి): ఈ నెల21 షూటింగ్ బాల్ పోటీలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ బాలికల ఎంపిక పోటీలు ఈ నెల 21న సిర్పూర్ (టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరై, ప్రిన్సిపల్ లావణ్యకు రిపోర్ట్ చేయాలని జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గురువేందర్ తెలిపారు.


