News March 10, 2025
సీతంపేట: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సీతంపేట ఐటీడీఏలో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పీవో కోరారు.
Similar News
News November 16, 2025
రాష్ట్రపతి CP రాధాకృష్ణన్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉప రాష్ట్రపతిని సత్కరించారు. గవర్నర్ రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందులో సీఎంతో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
News November 16, 2025
ఫుట్బాల్ రాష్ట్రస్థాయి టోర్నీ.. మెదక్ జట్టుకు తృతీయ స్థానం

పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నల్గొండలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించింది. మూడో స్థానం కోసం రంగారెడ్డితో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్లో మెదక్ జట్టు 4-3 స్కోరు తేడాతో విజయం సాధించిందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.
News November 16, 2025
ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.


