News August 15, 2024

సీతంపేట: సచివాలయ సెక్రటరీ అప్పలస్వామి మృతి

image

సీతంపేట మండలం కిల్లాడ గ్రామ సచివాలయ సెక్రటరీ అల్లాడ అప్పలస్వామి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం ఎం.రాజపురం. సచివాలయ సెక్రటరీగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వ్యక్తి ఇలా అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 10, 2025

సిక్కోలు నేతల మౌనమేలనో..?

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.

News December 10, 2025

ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.

News December 10, 2025

శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

image

పెందుర్తిలోని సుజాతనగర్‌లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్‌లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్‌ రైస్ పుల్లింగ్‌ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.