News April 11, 2025

సీతానగరం: ట్రాక్టరు తిరగబడి ఒకరి మృతి

image

సీతానగరం(M) రఘుదేవపురంలో ట్రాక్టరు తిరగబడి ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఇటుకబట్టీ యజమాని వెంకటేశ్వర్లు బట్టీ వద్ద మట్టి తొక్కుతుండగా ట్రాక్టరు తిరగబడి మట్టిలో కురుకుపోయాడు. ఎక్స్‌కవేటర్ సాయంతో అతడిని బయటకు తీసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీను తెలిపారు.

Similar News

News December 6, 2025

పోలీసులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ

image

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.

News December 5, 2025

ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

image

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్‌లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.

News December 5, 2025

రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్‌లతో నిఘా

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.