News April 15, 2025

సీతానగరం: ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

image

సీతానగరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అంటి పేట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గాడి లక్ష్మీని అప్పయ్య పేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రురాలిని పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 22, 2025

HYD: తెలుగు వర్శిటీ.. క్రికెట్ జట్టు కెప్టెన్లు వీరే!

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో క్రికెట్ టోర్నీ బుధవారం నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. జట్టు సారథులను ఎంపిక చేశామన్నారు.1.TU డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా అమీర్ 2.TU సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ముస్తాక్ 3.TU ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్‌గా వినోద్ 4.TU వారియర్స్ జట్టు కెప్టెన్‌గా ప్రవీణ్ 5.TU ది డామినేటర్స్ జట్టు కెప్టెన్‌గా అరుణ్

News October 22, 2025

NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.

News October 22, 2025

ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు

image

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం కింద క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనులకు గాను ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్‌లను అభినందించారు.