News April 15, 2025

సీతానగరం: ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

image

సీతానగరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అంటి పేట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గాడి లక్ష్మీని అప్పయ్య పేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రురాలిని పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు.

Similar News

News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.

News April 23, 2025

రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా‌సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎర వేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వారికి వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.

News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!