News January 26, 2025

సీతానగరం: పేలిన గ్యాస్ సిలిండర్.. అగ్ని ప్రమాదం

image

సీతానగరం మండలం రఘుదేవపురంలో ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా తునా తునకులు అయింది. కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Similar News

News February 18, 2025

కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. భార్య కుమారితో కలిసి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైకుపై తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బైకుపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. 

News February 17, 2025

రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తోడికోడళ్లు మృతి

image

రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.

News February 17, 2025

RJY: బాలికపై వేధింపులు.. నలుగురిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులకు గురి చేసిన నలుగురు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. సీఐ వివరాల మేరకు.. బొమ్మూరుకు చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె బంధువులు యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వేధించారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

error: Content is protected !!