News April 7, 2025
సీతానగరం: ప్రియురాలు ఒప్పుకోకపోవడంతో మృతి

మనసుకు నచ్చిన మహిళ తనతో ఉండదని అనే విషయాన్ని జీర్ణించకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని వేమగిరి సునీల్ (26) స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసకు మరదలు అయిన సదరు సదరు మహిళను కలిసి ఉందామని అడగాగ ఆంగీకరించకపోవడంతో మనస్థాపం చెంది మృతి చెందాడని ఎస్సై రామకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News January 4, 2026
RJY: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్

తూర్పుగోదావరి జిల్లాలో ‘ఆవాస్ ప్లస్’ హౌసింగ్ సర్వే పూర్తయినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 23,676 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. సొంత స్థలం ఉన్నవారు, లేనివారితో పాటు గతంలో ఇళ్లు అసంపూర్తిగా నిలిచిన వారి వివరాలను సేకరించారు. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లి సహా పలు మండలాల్లో ఈ లబ్ధిదారులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
News January 4, 2026
9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్‌లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.