News July 25, 2024
సీతానగరం: బాలికను అపహరించి అత్యాచారం

ఓ బాలికను అత్యాచారం చేసి వివాహం చేసుకున్న ఘటన సీతానగరంలో చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. ఓ వ్యాపారి ఇంటి నిర్మాణానికి చినకొండేపూడి వాసి 16 ఏళ్ల వీరబాబు పనికోసం వెళ్లి, ఆ ఇంట్లో 16 ఏళ్ల బాలికను ఈ నెల 11న అపహరించుకుపోయాడన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి, ద్వారకా తిరుమలలో ఆమె మెడలో తాళి కట్టాడని తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించారు.
Similar News
News December 8, 2025
నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
News December 8, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.