News February 6, 2025
సీతానగరం: రైల్వే ట్రాక్ పై మృతదేహం

సీతానగరం మండలం దాలినాయుడు వలస, మరిపివలస రైల్వే గేటు మధ్య రైలు పట్టాలపై మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పి హెచ్ సీ రత్నాకర్ తెలిపారు. మృతుడు సూరంపేట గ్రామానికి చెందిన చిట్టపిల్లి బోడన్న దొర(35)గా గుర్తించామని ఆయన తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెచ్ సీ రత్నకుమార్ తెలిపారు.
Similar News
News November 16, 2025
రాష్ట్రపతి CP రాధాకృష్ణన్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉప రాష్ట్రపతిని సత్కరించారు. గవర్నర్ రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందులో సీఎంతో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
News November 16, 2025
ఫుట్బాల్ రాష్ట్రస్థాయి టోర్నీ.. మెదక్ జట్టుకు తృతీయ స్థానం

పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నల్గొండలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించింది. మూడో స్థానం కోసం రంగారెడ్డితో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్లో మెదక్ జట్టు 4-3 స్కోరు తేడాతో విజయం సాధించిందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.
News November 16, 2025
ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.


