News March 29, 2025
సీతానగరం: వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

బొబ్బిలి మండలం కేశాయివలస సమీపంలో పోడు భూములలో మొక్కలకు నీరు పోస్తుండగా శుక్రవారం ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో సీతానగరం(M) కాశయ్యపేట చెందిన డ్రైవర్ పి.పోలిరాజు(56) అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణ సీఐ సతీశ్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 3, 2025
అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం

భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దిరెడ్డిగూడెంలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమైయ్యాయి. ఈ ప్రమాదంలో మంటలు అంటుకొని ఒకరు మృతి చెందారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
RCBని దెబ్బకొట్టిన సిరాజ్

ఏడేళ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ (GT) నిన్న మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆ జట్టునే దెబ్బ తీశారు. చిన్నస్వామి స్టేడియంలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో జోరు మీదున్న లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఆ జట్టుపై MOMగా నిలవడం విశేషం.
News April 3, 2025
సిరిసిల్ల జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. వీర్నపల్లి 36.9 °c, గంభీరావుపేట 36.8°c, కోనరావుపేట 36.3, సిరిసిల్ల 36.2, ఇల్లంతకుంట 36.0°c, బోయిన్పల్లి 36.1°c, చందుర్తి 35.2°c, రుద్రంగి 35.0 డిగ్రీలుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం పలు మండలాలలో మేఘాలు కమ్ముకుపోయి చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి.