News January 16, 2025

సీతానగరం: సువర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి

image

సువర్ణముఖి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు పెదబోగిలి గ్రామానికి చెందిన ఎస్.అనుదీప్ (27) బంధువులతో కలిసి స్నానానికి వచ్చాడు. ఇసుక కోసం తవ్విన గోతిలో అనుదీప్ మునిగిపోవడంతో బంధువులు గుర్తించి బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Similar News

News February 9, 2025

VZM: ‘అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించొద్దు’

image

విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సు‌తో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.

News February 9, 2025

VZM: యువతకు జిల్లా SP కీలక సూచన

image

మత్తు, మాదకద్రవ్యాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజ్ఞప్తి చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా, పండించినా చట్టరీత్యా తీవ్ర నేరంగానే పరిగణిస్తామన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. యువతను అప్రమత్తం చేసేందుకు సంకల్ప రథం ద్వారా కృషి చేస్తున్నామని మంచి జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

News February 8, 2025

VZM: జిల్లా ఎస్పీ దృష్టికి పోలీస్ సిబ్బంది సమస్యలు

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.

error: Content is protected !!