News August 6, 2024
సీతారాంపురం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

సీతారాంపురంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గారపాటి చెన్నకేశవులు (42) మృతి చెందారు. సీతారాంపురంలోని కోట వీధిలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు ఓ ఇంటి వద్ద కరెంటు పనిచేసేందుకు వెళ్లాడు. అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం లైన్ మార్చే క్రమంలో షాక్‌కు గురై అక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు.
Similar News
News October 24, 2025
జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం: మంత్రి ఆనం

జిల్లాను అన్నీ రంగాల్లో ముందు నిలపాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ మంత్రిని కలిసి అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై, వర్షాలకు చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కోరారు.
News October 24, 2025
స్వర్ణాంధ్ర లక్ష్యసాధన దిశగా అడుగులు: దినకర్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్’లో భాగంగా 2047 కల్లా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ మంత్రి ఆనంతో చర్చించారు. ఈ మేరకు దినకర్ మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఆహార భద్రత, పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, జిల్లాల అభివృద్ధి సూచికలు, పీఎం ధన ధాన్య కృషి యోజన అంశాలపై వారు చర్చించారు.
News October 24, 2025
వింజమూరు: కర్నూల్ బస్సు ప్రమాదంలో ఒక కుటుంబం సేఫ్

కర్నూల్ BUS ప్రమాదంలో వింజమూరు(M) కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేశ్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ప్రమాదాన్ని గమనించి BUS అద్దాలను పగులగొట్టి భార్య శ్రీలక్ష్మి(26), కుమారుడు అకీరా (2), కుమార్తె జయశ్రీ (5)లను రమేశ్ కాపాడుకున్నారు. వింజమూరు(M)గోళ్లవారిపల్లికి చెందిన <<18088100>>గోళ రమేశ్ కుటుంబం మృతి చెందిన విషయం తెలిసిందే.<<>> ఈ2 కుటుంబాలు హైదరాబాదులో దీపావళి వేడుకులను చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.


