News August 25, 2024
సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరి మృతి
సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. జింకలగూడెం సీతారాం ప్రాజెక్టు కాలువలో ఇద్దరు గల్లంతయ్యారని సమాచారం అందుకున్న ఎస్సై రాజేశ్ గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు ప్రమాదవశాత్తు పడిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2024
ఖమ్మం: ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం మాది: భట్టి
ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం తమదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తామని, విద్యుత్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. గత పాలకుల లాగా రాష్ట్ర సంపదను దోపిడీ చేసేందుకు సిద్ధంగా లేమని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వాళ్లకు చంప దెబ్బ కొట్టేలా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
News September 14, 2024
KMM: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈనెల 16 సోమవారం నాడు ఖమ్మం నగరంలో వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అటు నగరంలో శోభాయాత్ర జరిగే మార్గాలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాల మ్యాపును సీపీ విడుదల చేశారు.
News September 14, 2024
చర్ల: సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు
చర్ల సరిహద్దులోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పూర్వాతి గ్రామంలో పోలీసుల బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడులు చేశారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీన్ని భద్రతా బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.