News March 7, 2025
సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరం: కలెక్టర్

భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణం, మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఏరు ఫెస్టివల్ విజయవంతం చేయాలని సూచించారు. ఆన్లైన్లో 75%, 25% మాన్యువల్‌గా టికెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
Similar News
News December 6, 2025
SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
News December 6, 2025
చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News December 6, 2025
US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.


