News April 9, 2025

సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.

Similar News

News November 27, 2025

బెంగళూరుకు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకుని గురువారం బెంగళూరుకు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బుధవారం అరటి తోటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. సాయంత్రం ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి బెంగళూరుకు పయనమై వెళ్లారు.

News November 27, 2025

ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన

image

ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది. ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట మండలంలో వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో అధిక నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో ఆ బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News November 27, 2025

కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

image

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.