News April 9, 2025
సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.
Similar News
News April 24, 2025
కడప: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని 4 IIITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
ఉమ్మడి కడప: ఒకేసారి తండ్రి, కూతురు పాస్

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన 2025 పది పరీక్షా ఫలితాల్లో తండ్రి, కూతురు ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 268 మార్కులు తెచ్చుకున్నారు. ఈయన 9వ తరగతి వరకు చదివి డ్రాప్ అయ్యారు. ఈ ఏడాది ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి పాస్ అయ్యారు. ఆయన కుమార్తె మోడెం పూజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించింది.
News April 24, 2025
ప్రొద్దుటూరులో చదువుకున్న అమ్మాయికి స్టేట్ థర్డ్

టెన్త్ ఫలితాలలో జె.శ్రీవాణి సత్తా చాటింది. రైల్వే కోడూరు మంగంపేటలో నివాసం ఉంటున్న జె. శ్రీవాణి 598 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్, జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించింది. ప్రొద్దుటూరు YMR కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి ఈ ఘనత సాధించింది. ఈమె తల్లిదండ్రులు జానకిరామారెడ్డి, లక్ష్మీదేవి, చిరు వ్యాపారస్తులుగా మంగంపేటలో జీవనం కొనసాగిస్తున్నారు.