News November 16, 2024

సీదిరి అప్పలరాజుకి కీలక బాధ్యతలు

image

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్‌కి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ క్యాడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.

Similar News

News December 14, 2024

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ

image

టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీచేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. ఇటీవల కాలంలో జనసేన నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కాగా ఈ మేరకు టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు.

News December 14, 2024

టెక్కలి: భార్యభర్తలపై హత్యాయత్నం

image

టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పిట్ట రాజేశ్వరి, పిట్ట రామ్మోహన్  దంపతులపై వారి సమీప బంధువులు ఇద్దరు కత్తితో హత్యాయత్నం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో భార్యాభర్తలపై దాడి జరిగినట్లు గ్రామస్థులు అంటున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

News December 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో చలి పంజా ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. చలిగాలుల ఉద్ధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు. గ్రామాల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకొని కాచుకుంటున్నారు. ఎండ వచ్చి చలి తీవ్రత తగ్గాకే పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతకు సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.