News June 2, 2024

సీపాక్ సర్వే.. ‘కరీంనగర్, పెద్దపల్లిలో BRS గెలుస్తుంది!’

image

కరీంనగర్, పెద్దపల్లిలో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా కరీంనగర్లో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేల్లో వెల్లడైంది.

Similar News

News October 1, 2024

దొంగతనాల నివారణకు ఒక స్పెషల్ టీం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలోని దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం నియమించి వాటిని నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితుడిపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుచేయడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.

News October 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క.
@ హుజురాబాద్‌లో డెంగ్యూతో బాలిక మృతి.
@ ముస్తాబాద్ మండలంలో స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపటినుండి డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
@ జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన మెట్పల్లి విద్యార్థులు.
@ చందుర్తి మండలంలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య.

News September 30, 2024

ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలవాలి: సీతక్క

image

తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా నిలిచేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కరీంనగర్లో ఆమె మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల అంశం సీఎం దృష్టిలో ఉందని త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామస్తులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలన్నారు.