News March 6, 2025
సీపీఎంకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి: కూనంనేని

సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరారు. సీఎం అధిష్టానంతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 6, 2025
ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

అంబర్‌పేట్‌లో నూతన ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయ భవనాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర భద్రత కోసం సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచాలని సూచించారు. పోలీసులను చూస్తే నేరస్థలకు భయంపుట్టాలని, ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు.
News March 6, 2025
మన హైదరాబాద్ కల్చర్ వేరు!

తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi
News March 6, 2025
సికింద్రాబాద్: స్నేహితుడి దారుణ హత్య

HYDలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరుణి సూపర్ మార్కెట్ వెనకాల రాత్రి ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడు నగేశ్‌ను నర్సింగ్ అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.