News January 29, 2025
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జాన్‌వెస్లీ ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా జరిగిన సీపీఎం మహాసభల్లో జాన్‌వెస్లీని పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. సీపీఎం రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒక దళితుడ్ని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
Similar News
News February 14, 2025
తంగళ్ళపల్లి: అధ్యాపకుడిగా మారిన కలెక్టర్

తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా మాథ్స్, బాటని పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించారు. పాఠ్యాంశాలలోని అనుమానాలను విద్యార్థులకు నివృత్తి చేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
News February 14, 2025
ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశం

బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కేజీహెచ్ ఉన్నతాధికారులకు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కేజీహెచ్‌లో అధికారులతో సమావేశమయ్యారు. 2024లో ఎంతమంది పిల్లలు జన్మించారు.. ఎంతమంది మరణించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిడ్డ పుట్టిన గది వద్దకు తప్పులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.