News March 17, 2025
సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన క్రైమ్స్ డీసీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన బి.జనార్దన్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసి మొక్కను అందజేశారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీల నియంత్రణకై తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలు, అలాగే పెండింగ్ ఉన్న చోరీ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు నిందితులను పట్టుకోవడం కోసం పోలీస్ కమిషనర్ క్రైమ్ డీసీపీ పలు సూచనలు చేశారు.
Similar News
News April 21, 2025
‘డ్రగ్స్ తీసుకున్నా’.. పోలీసు విచారణలో టామ్ చాకో!

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మేజర్ యాక్టర్లు కూడా మాదకద్రవ్యాలు వాడతారని చెప్పినట్లు సమాచారం. పోలీసుల సోదాలతో షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకోవడం కష్టంగా మారినట్లు చెప్పారని పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. డ్రగ్స్ కొనేందుకు ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేసేవాడినని, అయితే వారెవరనే విషయం తనకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నాయి.
News April 21, 2025
MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
ధర్మవరానికి రండి.. UP సీఎంకు మంత్రి ఆహ్వానం

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం పట్టు వస్త్రం, నిమ్మలకుంట కళాకారులు తయారు చేసిన శ్రీకృష్ణుడి తోలుబొమ్మను సీఎంకు అందజేశారు. వీటి విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ధర్మవరానికి రావాలని కోరగా తన ఆహ్వానాన్ని సీఎం స్వీకరించారని మంత్రి తెలిపారు.