News November 8, 2024

సీప్లేన్‌లో శ్రీశైలానికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి సీప్లేన్‌లో బయలుదేరుతారు. 12.40 గంటలకు శ్రీశైలంలోని ఫ్లోటింగ్ జెట్టీ వద్దకు చేరుకుంటారు. 1 నుంచి 1.25 గంటల వరకు స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. తర్వాత్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు. అనంతరం మళ్లీ సీప్లేన్‌లోనే విజయవాడకు వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

Similar News

News December 2, 2024

ప్రేమ పేరుతో మోసం.. ఆదోనిలో ప్రియుడి కుటుంబంపై కేసు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఆదోనిలో కేసు నమోదైంది. సీఐ శ్రీరామ్ వివరాల మేరకు.. ఆదోనికి చెందిన గురుప్రసాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మైసూరు యువతి చందన పరిచయమైంది. ఇరువురూ ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

News December 1, 2024

గోనెగండ్ల: చీరకు నిప్పు.. చికిత్స పొందుతూ మహిళ మృతి

image

గోనెగండ్లకు చెందిన సుంకులమ్మ (81) అనే మహిళ కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిందని సీఐ గంగాధర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. ఎస్సీ కాలనీలో ఉండే సుంకులమ్మ నవంబర్ 28న వేడి నీళ్ల కోసం పొయ్యి దగ్గరకు వెళ్లగా చీరకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసామన్నారు.

News December 1, 2024

సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో డిసెంబర్ 8న ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందని తెలిపారు.