News August 28, 2024
సీరోలు: దారుణం.. గొడ్డలితో తండ్రిపై కొడుకు దాడి
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి గ్రామ శివారు కొత్త తండాలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకున్నది. భూ తగాదా విషయంలో తండ్రిపై కొడుకు స్వామి గొడ్డలితో దాడి చేయడంతో తండ్రి బానోత్ బీమా నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బీమా నాయక్ ను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 17, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MLG: వితంతు మహిళపై అత్యాచారం… బాధిత కుటుంబం నిరసన
> JN: నిమజ్జనంలో అపశ్రుతి..
> HNK: గంజాయి తరలిస్తుండగా.. అరెస్టు
> JN: సీత్యా తండాలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
> MLG: ఆదివాసీ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు మృతి..
> MHBD: బ్రెయిన్ ట్యూమర్ తో యువతి మృతి..
> JN: డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు..
News September 16, 2024
ఖిల్లా వరంగల్ కోటకు మంత్రి పొంగులేటి
ఖిల్లా వరంగల్ కోటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, వరంగల్ విద్యుత్ ఎస్ఈ మధుసూదన్ రావు, తాహశీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్ పాల్గొన్నారు.
News September 16, 2024
సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు ఏసీలో ప్రయాణం రూ.710కే
నాగ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు ఏసీ ధర రూ.710 అని అధికారులు స్పష్టం చేశారు. కాజీపేట స్టేషన్‌కు 10గంటల 4నిమిషాలకు ట్రైన్ చేరుకుంటుంది. నూతన ట్రైన్ ఏర్పాటుతో వ్యాపారులు, విద్యార్థులకు ఎంతగానో మేలు జరగనుంది.