News February 5, 2025

సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 27, 2026

మార్చిలో తిరుమలలో విశేష పర్వదినాలు

image

☞ మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి ☞ 3న కుమారధార తీర్థ ముక్కోటి, చంద్ర గ్రహణం కారణంగా ఉ. 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత ☞ 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ☞ 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ☞28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ☞30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.

News February 27, 2026

తూ.గో: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్!

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించినట్లు DEO కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈనెల 28లోపు ఆన్‌లైన్‌లో సవరించుకోవాలని సూచించారు. ఇదేచివరి అవకాశమని, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

News February 27, 2026

జగిత్యాల: బడి పిల్లల కథా రచనలకు ఆహ్వానం: DEO

image

JGTL జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు DEO రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథా రచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు. మార్చి15లోగా DEO కార్యాలయానికి పంపాలన్నారు. సుగుణాకర్, స్వామి పాల్గొన్నారు.