News February 5, 2025
సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
కరీంనగర్ ‘టాస్క్’లో రేపు జాబ్ డ్రైవ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో గల ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న(రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేపడుతున్నారు. 2024-25లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని వారు సూచించారు.
News November 13, 2025
కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.
News November 13, 2025
డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశ్యమన్నారు. 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేశారన్నారు.


