News February 5, 2025
సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
లారీ ఢీకొని యువకుడు మృతి

బైక్పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన భట్టిప్రోలు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. రేపల్లె – గూడవల్లికి బైక్పై వెళ్తున్న మహమ్మద్ వలి (27) ని అదే దారిలో వస్తున్న లారీ సూరేపల్లి బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో వలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 9, 2025
జాతీయస్థాయి స్విమ్మింగ్కు హర్షవర్ధన్ రాజు ఎంపిక

విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తెనపల్లి ప్రగతి కళాశాల విద్యార్థి బి. హర్షవర్ధన్ రాజు స్వర్ణం, కాంస్యం పతకాలు సాధించాడు. ఈ ప్రతిభతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఢిల్లీలో జరగనున్న 69వ నేషనల్ గేమ్స్కు అతడు ఎంపికయ్యాడు. విజయం సాధించిన హర్షవర్ధన్ రాజును కళాశాల యాజమాన్యం అభినందించింది.
News November 9, 2025
టీ20 WC వేదికలు ఖరారు?

ICC మెన్స్ T20 వరల్డ్ కప్-2026 వేదికలు ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో, కాండీలో మ్యాచులు జరగనున్నట్లు Cricbuzz పేర్కొంది. అహ్మదాబాద్, కోల్కతాలో సెమీ ఫైనల్స్ జరుగుతాయని, ఫైనల్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. SL లేదా PAK ఫైనల్ చేరితే కొలంబోలో ఫైనల్ జరిగే అవకాశముంది. FEB 7న టోర్నీ ప్రారంభమయ్యే ఛాన్సుంది.


