News February 5, 2025
సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2025
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచులు!

IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సెకండ్ హోంగ్రౌండ్ విశాఖపట్నంలో రెండు మ్యాచులు ఆడనుందని సమాచారం. DC తన మిగతా మ్యాచులను ఢిల్లీలోనే ఆడనుంది. మరోవైపు పంజాబ్ ధర్మశాలలో 3 మ్యాచులు ఆడుతుందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ సెంటర్ కింద పంజాబ్ ఈ స్టేడియాన్ని ఎంచుకుంది. వచ్చే నెల 22 నుంచి IPL ప్రారంభమవుతుందని, తొలి మ్యాచ్ RCB vs KKR మధ్య ఉంటుందని సమాచారం.
News February 16, 2025
సంగారెడ్డి: రేపు విధులలో చేరాలి: డీఈవో

డీఎస్సీ 2008 ద్వారా ఎంపికై నియామక పత్రాలు అందుకున్న నూతన ఉపాధ్యాయులందరు రేపు పాఠశాలలో విధులలో చేరాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఫిట్నెస్ సర్టిఫికెట్, అగ్రిమెంట్ కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రేపు సాయంత్రంలోగా పంపాలని సూచించారు.
News February 16, 2025
ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా?

ప్రస్తుతం ఆన్‌లైన్, పార్సిల్‌లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్‌ను నాశనం చేసి డీహైడ్రేటింగ్‌కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో ఫుడ్ తినడం బెటర్.