News February 5, 2025

సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2025

సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర

image

సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్రసంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

News February 12, 2025

సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర

image

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

News February 12, 2025

రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే..!

image

ప్రతిరోజూ 10వేల అడుగులు వేయడం వీలుకాని వారు కనీసం ఆపకుండా 30 నిమిషాలు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ‘అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అకాల మరణం నుంచి తక్కువ ప్రమాదం ఉంటుంది’ అని తెలిపారు. అయితే, నెమ్మదిగా నడవొద్దని, కాలక్రమేణా వేగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇది శరీర జీవక్రియ, శ్వాసకోశ, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

error: Content is protected !!