News January 22, 2025

సీరోల్: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంతోష్ సోని ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో బాలికలు 30, బాలురు 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 16 లోపు https://tsemrs.telangana.gov.in/schoolDet.php?s=EMRS%20Seerole వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News November 29, 2025

MHBD: చలికాలంలో పల్లెల్లో ఎన్నికల వేడి..!

image

చలికాలం పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. MHBD జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో పల్లె పోరుకు రె‘ఢీ’ అవుతున్నారు. పల్లెల్లో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేస్తున్నాయి.

News November 29, 2025

మెదక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

మెదక్ వెస్లీ పాఠశాలలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈవో విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించే ఎగ్జిబిట్స్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఉండాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక, రవాణా, వాతావరణ కాలుష్యం, కంప్యూటర్ రంగం వంటి వివిధ భాగాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.

News November 29, 2025

రోహిత్ శర్మ ముంగిట అరుదైన రికార్డులు

image

SAతో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 3 సిక్సులు బాదితే ODI ఫార్మాట్లో లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా నిలుస్తారు. అలాగే 98 రన్స్ చేస్తే 20వేల అంతర్జాతీయ పరుగులు పూర్తవుతాయి. 213 రన్స్ కొడితే 16వేల పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్‌గా అవతరిస్తారు. ఓ సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డ్ సృష్టిస్తారు. SAతో 3 వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.