News January 22, 2025

సీరోల్: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంతోష్ సోని ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో బాలికలు 30, బాలురు 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 16 లోపు https://tsemrs.telangana.gov.in/schoolDet.php?s=EMRS%20Seerole వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News April 19, 2026

కాకినాడ: యానిమేటర్లకు అందని సెల్ ఫోన్లు

image

జిల్లాలోని డ్వాక్రా యానిమేటర్లకు పంపిణీ చేయాల్సిన సెల్‌ఫోన్లు ఇంకా వారి చేతికి అందలేదు. నాలుగు రోజుల క్రితమే కలెక్టరేట్‌లో పంపిణీ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించినప్పటికీ, వెంటనే డి.ఆర్.డి.ఏ అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎం.ఎస్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,500 మందికి పైగా యానిమేటర్లు తమకు ఫోన్లు ఎప్పుడు అందజేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News April 19, 2026

అనకాపల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

దేవరాపల్లి మండలంలోని కొత్తూరు ముత్యాలంపాలెం గ్రామానికి చెందిన తమరాన అప్పారావు(58) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు గమనించి కె. కోటపాడు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని దేవరాపల్లి ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

గుంటూరు: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో గుంటూరు (D) రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 30,551 మందికి 26,856 మంది పాసయ్యారు. మొత్తం 7,808 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 27 లోపు ఫీజు చెల్లించాలి.