News November 21, 2024

సీలేరులో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్ సేవలు..!

image

గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరులో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తహశీల్దార్ టీ.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి సీలేరు డ్యామ్ పరిసరాలను పరిశీలించారు. డ్యాంలో సీ ప్లైన్‌కు సంబంధించిన జెట్టి నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలించారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా విశాఖ నుంచి కానీ రాజమండ్రి నుంచి బలిమెల వరకు సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 31, 2025

విశాఖ: నదిలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

image

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలోని గెడ్డలో గురువారం ధనుశ్రీ (13) గల్లంతైన విషయం తెలిసిందే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. ధనుశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

News October 31, 2025

విశాఖ: నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 3 రోజులుగా కొనసాగిన తుఫాన్ తరువాత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రత కోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO ప్రేమ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థులను తరగతులకు అనుమతించాలని సూచించారు.

News October 31, 2025

విశాఖ: బెట్టింగ్ యాప్.. మరో ఇద్దరి అరెస్ట్

image

బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్‌లు నడుపుతున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.