News April 21, 2025
సీలేరులో ఇద్దరు యువకులు గల్లంతు

చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. చింతూరుకి చెందిన శ్రీను, ప్రదీప్ గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. స్నానం చేయడానికి సీలేరు నదిలో దిగిన ప్రవాహానికి కొట్టుకుపోవడంతో అతన్ని రక్షించుకోవడం కోసం నదిలో దిగిన మరొక యువకుడు గల్లంతైనట్లు సమాచారం. స్థానికులు చింతూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 21, 2025
బాపట్ల: ఏఎన్ఎమ్‌ల సమస్యలపై స్పందించిన కలెక్టర్

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎమ్‌లను సర్వేలు, పింఛన్ల పంపిణీలో తమకి డ్యూటీలు వేస్తున్నారని, ఆరోగ్య శాఖకే పరిమితి చేయాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్లలో పని భారాన్ని ఏఎన్ఎమ్‌ల పై మోపవద్దని అధికారులను ఆదేశించారు.
News April 21, 2025
కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
News April 21, 2025
భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను మరచిపోం: పీఎం మోదీ

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోమని అన్నారు. ‘పోప్ ఫ్రాన్సిస్ మృతి చాలా బాధను కలిగించింది. ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం. జాలి, దయ, వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాదిమంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని పేర్కొన్నారు.