News August 6, 2024
సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై సర్వే

సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం విస్తృతంగా సర్వే నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జియోలాజికల్ సర్వే బృందం స్థానిక ఎస్ఈ చంద్రశేఖరరెడ్డితో కలిసి తొమ్మిది ప్రాంతాలను సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిన డీపీఆర్ ఆధారంగా పరిశీలన చేసింది. జీఎస్ఐ సభ్యులకు ప్రాజెక్టు గురించి ఎస్ఈ చంద్రశేఖరరెడ్డి వివరించారు
Similar News
News October 26, 2025
విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 26, 2025
మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన రద్దు

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖ పర్యటన రద్దయింది. ఆదివారం రాత్రి విశాఖ చేరుకుని మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారని మొదట ప్రకటన జారీ చేశారు. అయితే మొంథా తుపాన్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జీవీఎంసీ కమిషనర్

తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. సహాయక చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ (0891-2507225), టోల్ ఫ్రీ నంబర్ (1800-425-0009) ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, తప్పుడు సమాచారం నమ్మవద్దని సూచించారు.


